2జి స్పెక్ట్రమ్ పై టాటాకు ఎంపి రాజీవ్ చంద్రశేఖర్ బహిరంగ లేఖ

ఈ స్థితిలో ఈ బహిరంగ లేఖ రాయాల్సి వచ్చినందుకు బాధపడుతున్నానని, దీన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దని, తన లేఖ సూత్రబద్ధతకు, ప్రవర్తనకు సంబంధించిందని ఆయన అన్నారు. 2జి స్పెక్ట్రమ్ వ్యవహారంపై విచారణ జరిపించాలని రతన్ టాటా లాగానే తాను నమ్ముతున్నానని, ప్రభుత్వ విధాన నిర్ణయంలో మన దేశం కొన్నిసార్లు బనానా రిపబ్లిక్ గా వ్యవహరిస్తోందనే విషయంతో అంగీకరిస్తానని, ఇటువంటి విషయాల్లో అధికారం, ప్రభావం వేయగల శక్తి ఉన్న వ్యక్తులు ప్రేక్షకులుగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. మిమ్మల్ని ఓ మంత్రి 15 కోట్ల రూపాయల లంచం అడిగాడని మీరు చెప్పారు, అయితే ఆ సంఘటన జరిగినప్పుడే దాన్ని వెల్లడించి ఉంటే మరింత శక్తివంతంగా ఉండేది, దాన్ని ప్రతిఘటించడానికి వీలు కలిగేది అని ఆయన రతన్ టాటాకు రాసిన బహిరంగ లేఖలో అన్నారు.
తాను గతంలో టెలికమ్ ఎంటర్ ప్రెన్యూర్ ను కాబట్టి తాను ఈ లేఖ రాస్తున్నట్లు భావించవద్దని, దానికి ఉద్దేశాలను అంటగట్టవద్దని, ఈ విషయంలో మీతో చర్చలో పాల్గొనాలనే ఉద్దేశంతోనే ఈ లేఖ రాస్తున్నానని, మీ వైఖరికీ టాటా టెలికమ్ కంపెనీల వాస్తవస్థితికి మధ్య వైరుధ్యాన్ని చెప్పదలుచుకున్నానని ఆయన అన్నారు. టాటాతో విభేదిస్తున్న అంశాలను రాజీవ్ చంద్రశేఖర్ తన బహిరంగ లేఖలో సోదాహరణంగా వివరించారు.












Click it and Unblock the Notifications