దుగ్గల్ సిఎం కిరణ్ కుమార్ కు ఎందుకు కలిశారో చెప్పాలి: దామోదర్ రెడ్డి

ఈ నెల 11వ తేదీన కాంగ్రెసు తెలంగాణ నేతల సమావేశం జరుగుతుందని, ఇందులో భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటామని వారు చెప్పారు. తెలంగాణ ప్రజా సంఘాల సమన్వయ కమిటీ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని వారు చెప్పారు. ఉద్యమకాలంలో విద్యార్థుల కేసుల ఎత్తివేతకు తెలంగాణకు చెందిన మంత్రులు కె. జానారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, బస్వరాజు సారయ్య పూనుకోవాలని, ఈ విషయంపై జానా రెడ్డి రేపటిలోగా సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మంత్రి పదవులు చేపట్టిన తర్వాత కేసుల ఎత్తివేతను పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు.












Click it and Unblock the Notifications