హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ అక్రమార్జనలో సోనియా వాటా తేల్చండి: గాలి ముద్దుకృష్ణమ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telugudesam
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి లక్షలకోట్ల అక్రమార్జనలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఎంత ముట్టిందో కాంగ్రెస్ నాయకులు చెప్పాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు డిమాండ్ చేశారు. ప్రభుత్వ సలహాదారు పదవికి కెవిపి రామచంద్రారావు రాజీనామా చేసి 15 రోజులు అవుతుందని అయినా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆ రాజీనామాను ఆమోదించలేదని, దానికి గల కారణాలు తెలియజేయాలని వారు అన్నారు.

సొంత ఆదాయం పెంచుకోవడానికే కాంగ్రెస్ వాళ్లు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సాక్షాత్తూ డిఎంకే కూడా జెపిసిని కోరుతున్నప్పటికీ కేంద్రం ఆమోదించక పోవటానికి కారణం 2జి స్పెక్ట్రం స్కాములో సోనియాగాంధీ హస్తం ఉండటమేనన్నారు. ప్రపంచంలో భారతదేశ ప్రతిష్టను యుపిఎ ప్రభుత్వం దిగజార్చుతుందన్నారు. చట్టసభల సమావేశాలకు కిరణ్ చాలా ప్రాధాన్యం ఇస్తారని తాము భావించామని అయితే అందుకు విరుద్దంగా ఆయన తీరు ఉందని మరో నేత దాడి వీరభద్రారావు అన్నారు. శాసనసభలను 15 రోజులను జరపాలని డిమాండ్ చేశారు. శాసనసభ సమావేశాలు తూతూ మంత్రంగా జరపాలని కిరణ్ భావిస్తున్నారని ఆరోపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X