జగన్ ను పవర్ ఫుల్ పంచ్ లతో చీల్చి చెండాడిన విహెచ్

V Hanumantha Rao
న్యూఢిల్లీ: తమ పార్టీకి రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టడానికి సిద్ధమవుతున్న వైయస్ జగన్ ను కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వి. హనుమంత రావు తన పవర్ ఫుల్ పంచ్ లతో, తనదైన శైలిలో చీల్చి చెండారు. వైయస్ జగన్ ధన అహంకారంతో వ్యవహరిస్తున్నారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. వైయస్ జగన్ సొంతంగా మాట్లాడడం లేదని, ధన అహంకారం జగన్ చేత మాట్లాడిస్తోందని ఆయన అన్నారు. 2004 ఎన్నికల సమయంలో వైయస్ జగన్ ఆస్తి ఎంత, ఇప్పుడెంత తేలాల్సిన అవసరం ఉందని, అంత ధనం ఎలా సంపాదించాడో కూడా తేలాలని ఆయన అన్నారు. అంత పెద్ద మొత్తంలో ముందస్తు పన్ను కట్టేంత సొమ్ము వైయస్ జగన్ ఎలా సంపాదించాడని ఆయన అడిగారు. నాయన వైయస్ రాజశేఖర రెడ్డి శవాన్ని పక్కన పెట్టుకుని జగన్ సంతకాల సేకరణ జరిపాడని ఆయన విమర్శించారు. తండ్రి మరణించినప్పుడు ఎవరైనా అంత్యక్రియలు, పెద్ద కర్మ ముగిసిన తర్వాత పెద్దలను పిలిపించి ఆస్తి లెక్కలు తేల్చుకుంటారని, వైయస్ జగన్ నాయన శవాన్ని పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాల సేకరణ జరిపించాడని ఆయన అన్నారు. ఆ రకంగా జగన్ దేశంలో ఎవరూ చేయని పని చేశాడని ఆయన వ్యాఖ్యానించారు.

అటువంటి వ్యక్తి పార్టీ పెడ్తాడట, 30 ఏళ్లు పరిపాలిస్తాడట, జగన్ మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని, అన్నం పెట్టిన కాంగ్రెసును, సోనియాను తిడ్తాడు, రాహుల్ ను, పార్టీ సీనియర్ నేతలూ తిడ్డాడని, శవమే రాలేదు, సంతకాలు సేకరించాడు, అతను త్యాగం చేశానని అంటున్నాడని ఆయన అన్నారు. 150 మంది శాసనసభ్యులు సంతకాలు చేసినా తాను ముఖ్యమంత్రి పదవి వదులుకున్నానని చెప్పుకుంటున్నాడని, పెద్ద త్యాగం చేశానని చెప్పుకుంటున్నాడని, శవం దగ్గర సంతకాలు పెట్టాలని అడిగినప్పుడు పెట్టకుంటే ఏమనుకుంటారోనని పెట్టారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎన్నో అవకాశాలు ఇచ్చారని, జగన్ మామకు కడప మేయర్ గా అవకాశం ఇచ్చారని ఆయన అన్నారు.

తన కుటుంబాన్ని చీల్చారని వైయస్ జగన్ అనడాన్ని ఆయన తప్పు పట్టారు. చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి వైయస్ జగన్ కోసం పార్లమెంటు సీటును త్యాగం చేశారని, చిన్నాన్నది త్యాగం కాదా, కుటుంబంలో అన్నీ తనకే కావాలని జగన్ ఉద్దేశ్యమని, నాయన మరణం తర్వాత అన్నీ నాకే కావాలని జగన్ అంటున్నాడని, వైయస్ వివేకానంద మంత్రి పదవి తీసుకుంటే తప్పవుతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పదవి గురించి ఆలోచిస్తున్న వైయస్ జగన్ ప్రజలకు సేవ చేస్తానంటే ఎవరూ నమ్మే స్థితి లేదని ఆయన అన్నారు. ప్రజలు తెలివిలేని వారు కాదని ఆయన అన్నారు.

జగన్ పార్టీ పెట్టుకోవచ్చు, కానీ కాంగ్రెసు కుంభకోణాలమయమని తిట్టడం సరి కాదని ఆయన అన్నారు. కాంగ్రెసులో కుంభకోణాల గురించి వైయస్ జగన్ మాట్లాడుతున్నాడు కాబట్టి అవి తేలాల్సిందేనని, కుంభకోణాలకు ఎవరు పాల్పడ్డారో తేలాలని ఆయన అన్నారు. వైయస్ జగన్ ఏదో ఆరోపిస్తే మీరు నన్ను అడుతారు, జగన్ ఆ ఆరోపణలు చేసినప్పుడు నీకు ఇంత డబ్బు ఎలా వచ్చిందని మీరు ఎందుకు ఆయనను అడగరు, జగన్ ను అడిగిన తర్వాతనే నా వద్దకు రండి అని విహెచ్ మీడియా ప్రతినిధులతో అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+