తెలంగాణకై ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద భాజపా సత్యాగ్రహ, లాఠీఛార్జి

ఈ నేపథ్యంలో పోలీసులకు, భాజపాకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు స్వల్ప లాఠీఛార్జ్ చేశారు. తెలంగాణ, సీమాంధ్ర అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాన్ని విభజించాలని డిమాండు ఈ సందర్భంగా భాజపా డిమాండు చేసింది. దివంగత ప్రధాని నెహ్రూ సైతం విడిపోవాలనుకున్నప్పుడు విడిపోవాలని చెప్పారని వారు అన్నారు. గత డిసెంబరులో చిదంబరం తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు ప్రకటన చేశారని, దానికి కట్టుబడి ఉండాలని వారు డిమాండు చేశారు. శ్రీకృష్ణ కమిటి నివేదిక తెలంగాణకు అనుకూలంగా ఉంటుందనే ఆశాభావం వారు వ్యక్తం చేశారు. అయితే నివేదిక ఎలా ఉన్నా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందేనని వారు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications