దోచుకోవడమే విశ్వసనీయత అయితే అది నా వల్ల కాదు: బాబు

Chandrababu Naidu
హైదరాబాద్‌: దోచుకోవడమే విశ్వసనీయత అయితే అది తన వల్ల కాదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. కాంగ్రెసు చేసిన విమర్శలపై ఆయన శుక్రవారం తీవ్రంగా ప్రతిస్పందించారు. విశ్వసనీయత అంటే నిర్వచనం ఏమిటి, ఎందులో విశ్వసనీయత, సుస్థిర పాలనలోనా, సమర్థ నాయకత్వం అందించడంలోనా అని ఆయన ప్రశ్నించారు. దోచుకోవడమే విశ్వసనీయత అయితే అది తన వల్ల కాదని ఆయన అన్నారు. కాంగ్రెసు నాయకత్వ లోపం వల్ల ఇబ్బంది పడుతోందని ఆయన అన్నారు.

కాంగ్రెసుకు, తమ పార్టీకి ఓట్లలో తేడా ఒక్క శాతం మాత్రమేనని, ప్రజలు తమ వైపే ఉన్నారని ఆయన అన్నారు. రైతు సమస్యలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అవగాహన లేదని, అమలాపురం వెళ్లి వేరుశనగ పంట ఎక్కడ అని అడిగిన ఘనుడని ఆయన అన్నారు. సభ వాయిదా పడితే రైతు సమస్యలపై చర్చ జరగకుండా చూసుకోవచ్చుననేది ప్రభుత్వ ఆలోచన అని ఆయన అన్నారు. రైతులు శాసనసభ వైపు చూస్తున్నారని ఆయన అన్నారు. రైపు జాతీయ రహదారులను దిగ్బంధిస్తామని ఆయన చెప్పారు. ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు రోడ్డుకు అడ్డం పెట్టి రహదారులను అడ్డుకోవాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+