వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎఫెక్టు, బెజవాడలో కాంగ్రెస్ ఖాళీ?

ఆయన బాటలోనే జగ్గయ్యపేట, నూజివీడు, మైలవరం, విజయవాడ వెస్టు మాజీ శాసనసభ్యులు ఉదయభాను, తాటి వెంకట ప్రతాప్ అప్పారావు, జ్యేష్ట రమేష్, జలీల్ ఖాన్, విజయవాడ మాజీ మేయర్ తాటి శకుంతలతదితరులు జగన్ తో వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వీరి బాటలోనే మాజీ మునిసిపల్ చైర్మన్లు, జెడ్పీటీసీ సభ్యుడు నాగేశ్వరరావు కూడా క్యూ కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. నాని దారిలోనే మరో ముగ్గురు శాసనసభ్యులు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పెడన శాసనసభ్యుడు జోగి రమేష్ ఒక్కడే జగన్ వెంట వెళతారని ఇప్పటి వరకు అందరూ భావించారు.
పేర్ని నాని కాంగ్రెస్ పై చాలా అభిమానం ఉన్న కార్యకర్త. ఆయనపై ఆదివారం వరకు ఎవరికీ సందేహాలు లేవు. కానీ అనూహ్యంగా నాని ఆదివారం జగన్ వెంట వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తాను జగన్ వెంట వెళ్లడానికి పదవులనో డబ్బులనో ఆశించి వెళ్లడం లేదని చెప్పారు. తన అభిమానులు, కార్యకర్తల కోరిక మేరకే వెళుతున్నానని చెప్పారు. అయితే అధిష్టానానికి పూర్తి మద్దతుదారుడైన నానితో రైతాంగ సమస్యలు పరిష్కరించడానికంటూ వెళ్లిన జగన్ రాత్రంతా మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. మంత్రి పదవి ఇవ్వనందుకే నాని జగన్ వెంట వెళ్లడానికి సిద్ధమయినట్టు వార్తలు వస్తున్నాయి. వెంటనే కాంగ్రెస్ నాయకత్వం వెంటనే స్పందించి నానితో చర్చలకు సిద్ధపడింది. అయితే నాని జగన్ వైపే మొగ్గు చూపించడం గమనార్హం.












Click it and Unblock the Notifications