కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీయేనన్న ప్రణబ్ ముఖర్జీ

Pranab Mukharjee
ముంబై: రానున్న 2014 ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీయే ప్రధాని అని కేంద్రమంత్రి ప్రణబ్ మఖర్జీ చెప్పారు. శనివారం ముంబయిలో జరిగిన ఓ అవార్డు ప్రదానోత్స కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భవిష్యత్తు ప్రధాని ఎవరని కొందరు అఢిగిన ప్రశ్నకు భారత దేశానికి రాహుల్ గాంధీయే తదుపరి ప్రధాని కావొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు.

ఆ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ ప్రశ్నించగా కాబోయే ప్రధాని ఎవరని ప్రణబ్ ను ప్రశ్నించారు. దానికి ఆయన బహుశా, రాహుల్ గాంధీయే కావొచ్చు అన్నారు. అయితే దేశ ప్రజలే దీనిని నిర్ణయించాలి. ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. అయితే గతంలో ఢిల్లీలో 2014లో ప్రణబ్ ముఖర్జీని ప్రధానిని చేయాలని పోస్టర్లు వెలిసిన విషయం తెలిసిందే. ఆ పోస్టర్లు పార్లమెంటు హాలుకు వెళ్లే దారిలో వెలిసి సంచలనం సృష్టించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+