న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని సుల్తాన్‌పురి ప్రాంతంలో యువతిపై కొందరు యువకులు అత్యాచారం చేసిన దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఆ యువతి ఓ కాల్ సెంటర్ లో పని చేస్తుంది. ఆ యువతి ఎప్పటి మాదిరిగానే కాల్ సెంటర్ లో తన ఉద్యోగాన్ని ముగించుకొని తిరిగి వస్తుండగా ఆ యువతిని నలుగురు యువకులు తమ కారులో బలవంతంగా తీసుకెళ్లారు. ఎవరూ లేని ఓ ప్రాంతానికి తీసుకెళ్లి బలవంతంగా సామూహిక అత్యాచారం చేశారు. అయితే యువతిపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో నిందితులందర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారణ జరుపుతున్నారు. కాగా బాధితురాల్ని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తున్నారు.