హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆంధ్ర పాలనలో తెలంగాణకు న్యాయం జరగదు: ఈటెల, హరీష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harish Rao
హైదరాబాద్: ఆంధ్ర పాలకుల నీడలో తెలంగాణకు, తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరగదని మరోసారి నిరూపితమయిందని తెరాస శాసనసభా పక్షనేత ఈటెల రాజేందర్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మంగళవారం శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ వారిని సభనుండి సస్పెండ్ చేసిన తర్వాత వారు గన్ పార్కుకు ర్యాలీగా వెళ్లారు. అక్కడ బైఠాయించారు. అన్ని పార్టీలు విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని కోరినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వం మా గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తుందని దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. కేసులు ఎత్తివేస్తామని ఓ వైపు చెబుతూనే మరోవైపు విద్యార్థులపై కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారన్నారు.

జైళ్లలో మగ్గుతున్న విద్యార్థులను విడుదల చేయటం లేదన్నారు. గతంలో ఐపిఎస్ ఆఫీసర్లను, అనేక దాడులకు పాల్పడ్డవారిపై కేసులు ఎత్తివేసిన ప్రభుత్వం విద్యార్థులపై మాత్రం కేసులు ఎత్తివేయడానికి మీనమేషాలు లెక్కిస్తుందన్నారు. 400 మంది విద్యార్థులను కోల్పోయి న్యాయం కోసం ఉద్యమించిన విద్యార్థులపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. రంగా హత్య తర్వాత జగిరిన దమనకాండ నేరస్తులను ప్రభుత్వం వదిలి పెట్టిందని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తే తెలంగాణ ప్రజలు బుద్ది చెబుతారన్నారు.

అన్ని పార్టీలు కోరినప్పటికీ, ఇవాళ ఖచ్చితంగా మా గొంతు నోక్కే ప్రయత్నం చేసింది, మూల్యం చెల్లించక తప్పదు, కేసులు ఎత్తివేస్తామని చెబుతూనే మరోవైపు విద్యార్థులను అరెస్టు చేసింది, జైళ్లలో మగ్గుతున్న విద్యార్థులను విడుదల చేయటం లేదు, గతంలో ఐపిఎస్ ఆఫీసర్లను హత్య చేసిన వారిని, 400 మందిని విద్యార్థులను పొగోట్టుకొని ఉద్యమించిన వారని జైళ్లలో, వంగవీటి రంగా తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు బుద్ది చెబుతారు.

కేసులు ఎత్తివేయకుండా తెరాస ఎమ్మెల్యేలను అసెంబ్లీనుండి ఎత్తివేయించారని హరీష్ రావు అన్నారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు బయటకు వెళ్లి రఘువీరారెడ్డితో సస్పెన్షన్ ప్రకటన చేయించారన్నారు. కాంగ్రెస్ శాసనసభ్యులు, మంత్రులు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ తిరుగుతారని ప్రశ్నించారు. కేసులపై ఎంత సమయం తీసుకుంటారని ప్రశ్నిస్తే దాటవేట ధోరణి ప్రదర్శించారు. అసెంబ్లీనుండి మమ్మల్లి బయటకు పంపించినప్పటికీ ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటామన్నారు.

తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది మేమే అనే తెలంగాణ కాంగ్రెస్ నేతలు డిసెంబర్ 31 తర్వాత తెలంగాణ తేకుంటే రాజీనామా చేస్తామన్నారు. కానీ విద్యార్థులపై కేసులు ఎత్తివేయడానికే మొగ్గు చూపడం లేదన్నారు. కేసులు ఎత్తివేయడానికి ఇష్టపడని వారు తెలంగాణ కోసం రాజీనామా ఏం చేస్తారని ప్రశ్నించారు. జైళ్లలో మగ్గుతున్న విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని, కేసులు పూర్తిగా ఎత్తివేయాలన్నారు. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలన్నారు. కూనీకోర్లకు క్షమాభిక్ష పెట్టి విద్యార్థులకు జైలు శిక్షా అంటూ నినాదాలు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X