సమైక్యాంధ్ర ఉద్యమం లేదు, హైదరాబాద్ తెలంగాణలోదే: ఉండవల్లి

Undavalli Arun Kumar
హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై కాంగ్రెసు రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం శాసనసభా ఆవరణలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం లేనేలేదని, ఈ విషయాన్ని తాను ఎప్పుడూ చెబుతూ వస్తున్నానని ఆయన అన్నారు. హైదరాబాదు తెలంగాణలో అంతర్భాగమేనని ఆయన చెప్పారు.

హైదరాబాదులో తాము కిరాయిదారులమేనని, అయితే కిరాయిదారులకు ఉండే హక్కులకు తమకు ఉంటాయని ఆయన అన్నారు. పంచాయతీ అంతా హైదరాబాదు గురించేనని ఆయన చెప్పారు. మీడియాలో ఈ వార్త గుప్పుమనగానే ఉండవల్లి అరుణ్ కుమార్ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. సమైక్యాంధ్రపై, హైదరాబాదుపై తాను చేసినట్లు మీడియాలో వచ్చిన వార్తలు నిజం కాదని ఆయన ఆ తర్వాత అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+