రైతు సమస్యలపై పట్టువీడని చంద్రబాబు: అసెంబ్లీ వాయిదా

Telugudesam
హైదరాబాద్: సభలో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి రైతు సమస్యలపై చర్చించాలని తెలుగుదేశం పార్టీ బుధవారం పట్టుబట్టడంతో ఉపసభాపతి నాదెండ్ల మనోహర్ 10 నిమిషాలు సభను వాయిదా వేశారు. అనంతరం పార్టీన నాయకులను తన ఛాంబర్లోకి ఆహ్వానించారు. ప్రశ్నోత్తరాల రద్దుపై చర్చించేందుకు తెదేపా పట్టుబట్టడంతో వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతు సమస్యపైనే చర్చించాలని పట్టుబట్టారు. పంట నష్టపోయిన రైతులకు మద్దతు ధర ప్రకటించాలన్నారు. తడిసిన ధాన్నాన్ని, రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై విపక్షాలు పట్టుబడితే ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు.

అసెంబ్లీని విపక్షాలు స్తంభింపజేస్తున్నాయని అధికార పార్టీ అనడం సరికాదన్నారు. 2జి స్పెక్ట్రం కుంభకోణంపై పార్లమెంటు నెల రోజుల పాటు స్తంభించడానికి కారణం అధికార పార్టీయేనన్నారు. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందని, అక్కడ కాంగ్రెస్ పార్టీ విపక్షాలతో కలిసి 5 రోజులుపాటు సభను స్తంభింపజేశాయన్నారు. ఒరిస్సాలో విపక్షాలు పోడియంపై పడుకొని నిరసనలు తెలిపాయన్నారు. విపక్షాలు ప్రజా సమస్యలు పరిష్కరించాలనే పోరాడుతాయి.

సమస్యలు పరిష్కరించాలని మేం సభ ప్రారంభమైన రోజునుండి కోరుతున్నా ప్రభుత్వం స్పందించటం లేదన్నారు. సమస్యలు చెప్పకోవటానికి వచ్చిన రైతు నాయకులను అరెస్టు చేసింది. వారి అరెస్టును ప్రశ్నించిన మా శాసనసభ్యులను, నన్ను సైతం అరెస్టు చేశారన్నారు. సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులు చేయడమేమిటని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+