గాలి జనార్ధన్ రెడ్డి, వైయస్ జగన్మోహన్ రెడ్డి భేటీ మర్మమేమిటి?

కాంగ్రెసు పార్టీ ఆధారంగా వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకున్న దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రాధాన్యత రాష్ట్రంలో వారికి కలిసి వస్తుంది. గాలి భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తి. కాంగ్రెసు బద్ద విరోధి. కాంగ్రెసు కు బద్ద విరోధి అయినప్పటికి గాలి అవినీతిపై కేంద్రం చర్యలకు మొగ్గు చూపకపోవడానికి కారణం వైయస్ రాజశేఖర్ రెడ్డియే. ఆంధ్రప్రదేశ్ లో వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పిన గాలి జగన్ మద్దతు ఇచ్చి తద్వారా రాష్ట్రంలో కాంగ్రెసు కు చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇటు రాష్టంలో, అటు కేంద్రంలో చివరి అంచుపైన ఉన్నకాంగ్రెసు, యూపిఏ ప్రభుత్వాన్ని దెబ్బతీసే లక్ష్యంగా వారు పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఎంత తొందరగా పడిపోతే అంత తొందరగా జగన్ తన తండ్రి మరణాన్ని క్యాష్ చేసుకోవచ్చుననే యోచనలో ఉన్నాడు. అవినీతి కుంభకోణాలలో కూరుకుపోయిన యుపిఏ ప్రభుత్వం పడిపోతే భాజపా గద్దెనెక్క వచ్చనేది గాలి వ్యూహంగా తెలుస్తోంది. రాష్ట్రంలో, దేశంలో ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితి ఉన్నదని స్వయంగా కాంగ్రెసు పార్టీ వారే ఒప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. డబ్బు ఆశచూపి శాసనసభ్యులను, పార్లమెంటు సభ్యులను కొనే దుస్సాంప్రదాయం గాలికి ఉండనే ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో కూడా శాసనసభ్యులు జగన్ వెంట వెళ్లడానికి అదే కారణమనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications