తెలంగాణ మహాగర్జనకు వరంగల్లులో భారీ ఏర్పాట్లు, పోరుకు రెడీ

మహాగర్జన 1000 ఎకరాల విస్తీర్ణంలో జరుగుతుంది. 3 వేలమంది వాలంటీర్లు, 100 మెడికల్ క్యాంపులు, 12 పెద్ద స్ర్కీన్లు, 200 కూర్చునే విధంగా సభావేదికను ఏర్పాటు చేశారు. సభకు వచ్చే ప్రజలకోసం లక్షల నీళ్ల ప్యాకెట్లు కూడా సిద్ధంగా ఉంచారు. సుమారు 25 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. కాకతీయుల కోటలో జరుగుతున్న ఈ మహాగర్జనకు ఆర్యసమాజ్ కు చెందిన స్వామీ అగ్నివేష్ వస్తున్నారు. మరోవైపు పిఏ సంగ్మా రావాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాలవల్ల ఆయన రాలేక పోతున్నట్టు సమాచారం.
కాగా మహాగర్జనను కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తుందని సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. సభకు వచ్చే తెలంగాణవాదులకు బస్సులు అద్దెకు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రావటం లేదన్నారు. ప్రభుత్వం సభను అడ్డుకోవాలని చూసినప్పటికీ రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ పార్టీ జరపనంత పెద్ద ఎత్తున సభ జరుగుతుందన్నారు. గర్జన సందర్భంగా బుధవారం రాత్రి ఓరుగల్లు పట్టణంలో తెలంగాణవాదులు కొవ్వత్తులతో ర్యాలీ నిర్వహించారు.












Click it and Unblock the Notifications