తెలంగాణ మహాగర్జనకు పోటెత్తిన జనం, వరంగల్ గులాబీమయం

స్వామి అగ్నివేశ్, పార్లమెంటు సభ్యురాలు విజయశాంతిలతో కలిసి కెసిఆర్ వరంగల్ కు చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ న్యాయమైందని స్వామి అగ్నివేశ్ మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటించగానే దానికి వ్యతిరేకంగా మాఫీయా ఏకమైందని ఆయన విమర్శించారు. కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ వచ్చి తీరుతుందని ఆయన అన్నారు.
మహాగర్జన సభ సందర్భంగా తెలంగాణలోని విద్యాసంస్థలను మూసేశారు. విద్యార్థులు విద్యాసంస్థలను బహిష్కరించి వరంగల్ కు చేరుకున్నారు. తెలంగాణ మహాగర్జన ఊహించినదాని కన్నా ఎక్కువ విజయవంతం కావడంతో తెరాస నాయకుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. సభా వేదికపైకి తెరాస శాసనసభ్యులు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, తెలంగాణ పొలిటికల్ జెఎసి చైర్మన్ కోదండరామ్, వివిధ జెఎసిల నాయకులు చేరుకున్నారు. వరంగల్ నగరం పూర్తిగా గులాబీ మయం అయింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వరంగల్ లో తలపెట్టిన తెలంగాణ మహాగర్జన సభకు గురువారం వేలాదిగా ప్రజలు తరలివచ్చారు.
వరంగల్లు రోడ్లన్నీ క్రిక్కిరిసిపోయాయి. సభా ప్రాంగణానికి ఐదు కిలోమీటర్ల మేర ప్రజలు నిండిపోయారు. వాహనాలు వెళ్లే పరిస్థితి కూడా లేదు. కళాకారులు తమ ప్రదర్శనలతో ప్రజల గుండెలను తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షలోని బలీయతకు అద్దం పడుతున్నారు.వరంగల్ సభా ప్రాంగణానికి కిలోమీటర్ల మేర వాహనాలు క్యూ కట్టాయి. ముంబై, సూరత్, ఔరంగాబాద్ నుంచి కూడా తెలంగాణ ప్రజలు ఈ సభకు తరలివచ్చారు. శ్రీకాంతాచారి ప్రాంగణం జనసముద్రమైంది. ఖమ్మం రోడ్డులో పోలీసులు వాహనాలను నిలిపేశారు. తెలంగాణ డెవలప్ మెంట్ తరఫున తెలంగాణ ఎన్నారైలు కూడా సభకు వచ్చారు. తెలంగాణలోని పది జిల్లాల నుంచి ప్రజలు వరంగల్ కు చేరుకున్నారు.












Click it and Unblock the Notifications