గాలి జనార్ధన్ రెడ్డితో వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక మంతనాలు

రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. గాలి కర్ణాటక మంత్రి అయినప్పటికీ జగన్ కు పూర్తి మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 21, 22వ తేదీలలో జగన్ చేపట్టబోయే 48 గంటల నిరాహార దీక్షపైన, జనవరిలో ప్రారంభం కానున్న ఓదార్పు యాత్ర, కడప పార్లమెంటు, పులివెందుల శాసనసభ నియోజకవర్గ ఉప పోరుపై చర్చించినటలు తెలుస్తోంది.
మొదట కర్నూలు చేరుకున్న జగన్ కర్నూలు జిల్లాలోని ముఖ్యనాయకులతో రిసెప్షన్ ఇంటిలోని పై గదిలో చర్చించారు. జగన్ తో తెలుగుదేశం పార్టీ అసమ్మతి శాసనసభ్యుడు బాలనాగిరెడ్డి, లబ్బి వెంకటస్వామిలతో పాటు జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు భేటీ అయ్యారు. జగన్ హెలికాప్టర్ లో నుండి దిగకముందే అందరూ హెలికాప్టర్ ను చుట్టుముట్టారు. ఆ తర్వాత అందరూ జగన్ కు ఘనస్వాగతం పలికారు.












Click it and Unblock the Notifications