ఆత్మరక్షణలో సిఎం కిరణ్: ప్రతిపక్షాలది రాజకీయమంటూ రైతులకు లేఖ

ప్రతిపక్షాలు రైతు సమస్యలను రాజకీయం చేయడం తగదన్నారు. తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రాధాన్యం పెంచుకోవటం కోసమే దీక్ష అంటున్నదన్నారు. రైతులు నష్టపోయి బాధలలో ఉంటే ఆత్మస్థైర్యం చెప్పాల్సిన ప్రతిపక్షాలు రాద్దాంతం చేయటం తగదన్నారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు రైతులకోసం పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. 2003కు ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సబ్సిడీని క్రమంగా పెంచామన్నారు. ఈ సంవత్సరం వడ్డీని కూడా మాఫీ చేశామన్నారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అరుదైన విషయమన్నారు.
వరదలతో నష్టపోయిన రైతులకు భారీ సహాయ కార్యక్రమాలు చేపట్టామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సేద్యానికి పెద్దపీఠ వేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం, రైతుల సంక్షేమం కోసం పని చేస్తుందన్నారు. మీ కోసం ఏం చేయాలో అంతా చేస్తామని ముఖ్యమంత్రి రైతులకు సూచించారు. రైతులను ఆదుకోవడానికి తడిసిన ధాన్యాన్ని కొనడానికి ఎఫ్ సిఐని కొనేవిధంగా చర్యలు చేపట్టామన్నారు.












Click it and Unblock the Notifications