డిజిపి అరవింద రావుపై మండిపడుతున్న తెలంగాణవాదులు

పోలీసులు బలగాలు తెలంగాణ ఉద్యమాన్ని ఆపలేవని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండ రామ్ అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉంటుందని ఆయన హెచ్చరించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు అనుకూలంగా రాకపోతే తీవ్రంగా ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణలో ఎక్కడా హింసాత్మక సంఘటనలు జరగలేదని రాజేందర్ అన్నారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని ఆయన హెచ్చరించారు. డిజిపి రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారని తెలంగాణవాదులు విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications