రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు: ఎండిఎంకే అధ్యక్షుడు వైగో

ఈ సందర్భంగా బాబు మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి కించపరిచేలా ఉందన్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే జాతీయవ్యాప్తంగా ఉద్యమాన్ని తీసుకు వెళతామన్నారు. చంద్రబాబుకు పేరు వస్తుందని స్పందించకపోయినా రైతులకోసమైనా స్పందించాలని తెదేపా నేత ఎర్రన్నాయుడు అన్నారు. జిల్లాల్లో పర్యటిస్తున్న చిరంజీవి చంద్రబాబును విమర్శించడం హాస్యాస్పదం అన్నారు.
రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ నిరాహార దీక్ష చేస్తున్న చంద్రబాబునాయుడికి ఏమైనా జరిగితే రాష్ట్రంలో ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా మిగలడని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. చంద్రబాబు పరిస్థితి ఆందోళనకరంగా ఉందదన్నారు. చంద్రబాబుకు ఏమైనా అయితే రాష్ట్రం రావణకాష్టంలా మారుతుందని పుట్టపర్తి శాసనసభ్యుడు పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications