చంద్రబాబు అరెస్టులో రాజకీయాలు లేవు: డిఎల్ రవీంద్రా రెడ్డి

దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని విధంగా తాము రైతులకు ప్యాకేజీ ఇచ్చామని ఆయన చెప్పారు. చంద్రబాబు బ్లడ్ షుగర్ తగ్గి హార్ట్ బీట్ లో తేడాలు వచ్చాయని, ఇది అత్యంత ప్రమాదకరమని, అందుకే అరెస్టు చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబుతో ఫోన్ లో మాట్లాడడానికి ప్రయత్నించారని, కానీ చంద్రబాబు మాట్లాడే స్థితిలో లేరని డాక్టర్ సోమరాజు చెప్పారని ఆయన అన్నారు. అవిశ్వాస తీర్మానం పెడితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం ఏం చేసిందో వివరించడానికి తమకు మంచి అవకాశం లభిస్తుందని ఆయన చెప్పారు. రైతుల కోసం తాము చేయాల్సింది చాలా ఉందని, ముందు చంద్రబాబు ఆరోగ్యం ముఖ్యమని, చంద్రబాబు ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications