ప్రభుత్వంపై తెదేపా ఫైర్, రైతుల సమస్యలు పరిష్కరిస్తే దీక్ష విరమణ

రైతుల ఆత్మహత్యలకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు అన్నారు. ప్రకటించిన సాయంపై రైతుకు నమ్మకముంటే ఆత్మహత్యలు ఎందుకు కొనసాగుతున్నాయన్నారు. రైతులపై చిత్తశుద్ధి ఉంటే సాయం మరింత ప్రకటించాలన్నారు. రైతులకు మాయమాటలు చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రైతులకు సరియైన న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ రైతు వ్యతిరేక ప్రభుత్వమని దేవేందర్ గౌడ్, కడియం శ్రీహరిలు చెప్పారు. ప్రభుత్వానికి రైతుల సమస్యలు పట్టడం లేదన్నారు. వ్యవసాయంపై నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. డిమాండ్లు పరిష్కరిస్తేనే చంద్రబాబు నాయుడు దీక్ష విరమణపై ఆలోచిస్తామని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications