రాష్ట్రంలో కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యలు: నలుగురు మృతి

Hyderabad
హైదరాబాద్: ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు సాయం ప్రకటించినప్పటిరీ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగలేదు. బుధవారం ఉదయం మరో నలుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఒక్కరు, కడప జిల్లాలో ఒక్కరు బలవన్మరణానికి పాల్పడ్డారు. అన్నపూర్ణ జిల్లా అయిన తూర్పుగోదావరి శంకరపురంలో ఆకుల అప్పారావు అనే వ్యక్తి పంటనష్ట పోవడంతో గుండెపోటుతో మరణించాడు. భర్త మరణ విషయం తెలుసుకున్న భార్య సైతం ఐదు నిమిషాల్లోనే గుండెపోటుతో మరణించింది.

ఇదే జిల్లాలోని తొండంగి మండలం కృష్ణాపురంలో మరో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లాలో 2 లక్షల మంది కౌలు రైతులు ఉన్నప్పటికీ వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రకటించిన సాయం ఏమాత్రం సరిపోవటం లేదు. గుంటూరు జిల్లా దాచెపల్లి మండలం తక్కెళ్లపాడులో నరసింహ అనే కౌలురైతు మరణించాడు. కడప జిల్లా సుండుపల్లి మండలంలో మునిశెట్టి అనే మరోరైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం ప్రకటించి ముందస్తు సాయం ఎప్పుడు అందుతుందో తెలియక, తెచ్చిన అప్పులు కట్టలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+