సోనియా గాంధీని తాకిన వైయస్ జగన్ లక్ష్యదీక్ష సెగ

Sonia Gandhi
న్యూఢిల్లీ‌: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ లక్ష్యదీక్ష సెగ 10జనపథ్ ను తాకింది. వైయస్ జగన్ దీక్షతో కాంగ్రెసు పార్టీకి రాష్ట్రంలో జరిగే నష్టాన్ని చూసి ఆమె కలవరపడుతున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు వైయస్ జగన్ కు చెందిన సాక్షి టీవీ చానెల్ ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. సోనియా గాంధీ ఆఘమేఘాల మీద రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులను తన నివాసానికి పిలిపించారు. అయితే, వైయస్ జగన్ వ్యవహారంపైనే కాకుండా తెలంగాణ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నిరాహార దీక్ష అంశాలు కూడా ఆమెను ఈ చర్యకు పురికొల్పినట్లు చెప్పవచ్చు. రైతులకు ఏ విధమైన ప్యాకేజీ ఇవ్వాలనే అంశంపై ఆమె పార్లమెంటు సభ్యులతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వైయస్ జగన్ దీక్షకు పెద్ద యెత్తున ప్రజలు, నాయకులు, శాసనసభ్యులు తరలిరావడం సోనియాను కలవరపెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాదాపు 25 మంది శాసనసభ్యులు జగన్ కు మంగళవారం మద్దతు ప్రకటించారు. తాజాగా, చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే షాజహాన్ కూడా జగన్ ను విజయవాడ దీక్షా ప్రాంగణంలో కలిశారు. మరో శాసనసభ్యుడు ఆళ్ల నాని కార్యకర్తలతో వైయస్ జగన్ దీక్షా ప్రాంగణానికి వస్తున్నారు. జగన్ కు మద్దతు తెలుపుతున్న శాసనసభ్యులతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అస్థిరం పాలయ్యే ప్రమాదం ఉందని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. దీంతో వైయస్ జగన్ దీక్షకు వచ్చిన శాసనసభ్యులకు అధిష్టానం నుంచి ఫోన్లు వచ్చినట్లు తెలుస్తోంది. జగన్ దీక్షకు హాజరైన శాసనసభ్యులను కట్టడి చేసేందుకు అధిష్టానం రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+