రేపు రాష్ట్రంలో రహదారుల దిగ్బంధం: టిడిపి, వామపక్షాల నిర్ణయం
హైదరాబాద్: రైతు సమస్యలపై ప్రభుత్వం ప్రతిస్పందించకపోవడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం, వామపక్షాలు రేపు గురువారం రాష్ట్రంలో రహదారుల దిగ్బంధం చేపట్టాలని నిర్ణయించాయి. నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం, వామపక్షాలు, మరికొన్ని పార్టీల నాయకులు బుధవారం సాయంత్రం సమావేశమైన ఆ మేరకు నిర్ణయం తీసుకున్నాయి.

ప్రభుత్వం శాసనసభలో ఇచ్చిన హామీలకు కూడా కట్టుబడి వ్యవహరించకపోవడం దారుణమని మరో తెలుగుదేశం నాయకుడు టి. దేవేందర్ గౌడ్ అన్నారు. రైతుల కోసం తమ డిమాండ్లను అసెంబ్లీ సమావేశాలకు ముందే ప్రభుత్వానికి ఇచ్చామని, అయినా ప్రభుత్వం సరిగా స్పందించలేదని ఆయన అన్నారు.
రైతుల పట్ల ప్రభుత్వం మర్యాదగా వ్యవహరించడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ విమర్సించారు. రాష్ట్రాన్ని గాడిదలు పాలిస్తున్నాయా అని ఆయన అడిగారు. వైద్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ప్రతిపాదన బ్లాక్ మెయిల్ చేసే విధంగా ఉందని ఆయన అన్నారు. అఖిల పక్ష సమావేశానికి ముఖ్యమంత్రి ఆహ్వానిస్తే తాము వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications