మంత్రి శంకర్ రావుపై వైయస్ జగన్ వర్గం నేతల ఫైర్

YS Jagan
విజయవాడ: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపే నేతలు రాజీనామా చేయాలన్న మంత్రి శంకర్ రావు వ్యాఖ్యలపై బుధవారం జగన్ వర్గం నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి దమ్ముంటే జగన్ కు మద్దతు తెలుపుతున్న నేతలపై చర్యలు తీసుకోవాలని శంకర్ రావు కోరాలని గోనె ప్రకాశ్ రావు సవాల్ విసిరారు. శంకర్ రావు పదవుల కోసమే అధిష్టానం భజన చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించిన ఇందిరాగాంధీ, కుటుంబాలను చీల్చే సోనియాగాంధీ ఉన్న కాంగ్రెస్ పార్టీకి వైయస్ జగన్ నైతికత గురించి ప్రశ్నించే అర్హత లేదన్నారు. దమ్మంటే జగన్ పై సిబిఐ విచారణ జరిపించాలన్నారు.

మంత్రి శంకర్ రావు వ్యాఖ్యలు సరికావని శాసనసభ్యుడు శేషారెడ్డి అన్నారు. కాంగ్రెస్ కు బలం ఉందో, జగన్ కు బలం ఉందో ప్రజల్లో తేల్చుకుందా రండి అన్నారు. జగన్ మద్దతుదారుల రాజీనామా కోరుతున్న వారు మొదట వారు రాజీనామా చేసి వైయస్ బొమ్మ లేకుండా గెలవాలని కొండా సురేఖ అన్నారు. అలా అయితే తాము రాజీనామాకు సిద్ధం అని కొండా సురేఖ తేల్చి చెప్పారు. అధిష్టానం రాజీనామా చేయాలని కోరితే రాజీనామా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నానని మాజీమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోసు అన్నారు.

శంకర్ రావు కూడా రాజీనామా చేసి మళ్లీ పోటీకి సిద్ధపడాలని అప్పుడే ఎవరికి ఎక్కువ మద్దతు ఉందో తెలుస్తుందన్నారు. అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి కూడా శంకర్ రావుపై ధ్వజమెత్తారు. జగన్ మద్దతుదారులను రాజీనామా చేయమని అడిగే హక్కు మంత్రి శంకర్ రావుకు లేదని సబ్బం హరి అన్నారు. శంకర్ రావు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వల్లే ఆయనకు మంత్రి పదవి లభించిందని సినీ నటి, రాజకీయ నాయకురాలు రోజా అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+