స్పందించకుంటే ప్రభుత్వంపై తిరగబడండి: రైతన్నలకు హరికృష్ణ పిలుపు

Harikrishna
హైదరాబాద్: రైతాంగ సమస్యలు పరిష్కరించాలంటూ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న చంద్రబాబునాయుడు ప్రాణత్యాగానికైనా సిద్ధం అంటున్నారు, కానీ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు దీక్ష విరమించేది లేదని అంటున్నారన్నారని రాజకీయ నాయకులు, సినీ నటుడు హరికృష్ణ గురువారం అన్నారు. దివంగత ఎన్టీఆర్ మడమ తిప్పకుండా పోరాటం చేయాలని తెలుగుదేశం పార్టీకి నేర్పారన్నారు. ఆ త్రోవలోనే చంద్రబాబు వెళుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పద్దతి ఏరుదాటాక తెప్పతగిలేసే విధంగా ఉందన్నారు. ఎన్నికలకు ముందు రైతుల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చి ఇప్పుడు రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.

కేంద్రం ప్రకటించిన 400 కోట్ల రూపాయల సాయం ఏమాత్రం సరిపోదన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం ఇదా అని ఆయన అన్నారు. సమస్యలపై రైతులు నిబ్బరం కోల్పోకూడదన్నారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా తిరగబడాలని చెప్పారు. రైతుల సమస్యలకోసం పోరాడుతున్న చంద్రబాబును రక్షించుకోవాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోవటం వల్ల పార్టీలో అంతర్గతంగా చర్చించుకొని భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెదేపా సీనియర్ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి వేరుగా విలేకరులతో చెప్పారు. చంద్రబాబు ఏ పరిస్థితుల్లో ఉన్నారో వైద్యుల నివేదిక తెలుపుతుందన్నారు. అవాస్తవాలు చెప్పటం సరికాదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+