కేరళ మాజీ ముఖ్యమంత్రి కె. కరుణాకరన్ కన్నుమూత

K Karunakaran
తిరువనంతపురం: కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెసు సీనియర్ నేత కె. కరుణాకరన్ గురువారం కన్నుమూశారు. ఆయన వయస్సు 93 ఏళ్లు. గత కొంత కాలంగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కరుణాకరన్ నాలుగు సార్లు కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశారు. శ్వాసకోశ సంబంధమైన సమస్య తలెత్తడంతో ఆయనను గురువారం ఉదయం వెంటిలేటర్ మీద ఉంచారు. అయితే ఫలితం లేకపోయింది. డిసెంబర్ 10వ తేదీన ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. చాలా కాలంగా ఆయన అస్వస్థతతో బాధపడుతున్నారు.

కరుణాకరన్ 1918 జులై 5వ తేదీన జన్మించారు. చదువుకు మధ్యలోనే స్వస్థి చెప్పి ఆయన భారత జాతీయ కాంగ్రెసులో చేరారు. బారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. పలు మార్లు జైలుకు కూడా వెళ్లారు. కేరళలో కరుణాకరన్ 1970లో యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్)ను ఏర్పాటు చేశారు. రాజ్యసభకు మూడు సార్లు, లోకసభకు రెండుసార్లు ఆయన ఎన్నికయ్యారు. ఆయన విభేదాల కారణంగా కాంగ్రెసుకు రాజీనామా చేసి 2005 మే 1వ తేదీ నేషనల్ కాంగ్రెసు (ఇందిర)ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత దాన్ని ఎన్సీపిలో విలీనం చేశారు. ఆ తర్వాత కూతురు పద్మజతో కలిసి తిరిగి కాంగ్రెసు పార్టీలోకి వచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+