వైయస్ సెజ్ ల పేరిట రైతుల నోట్లో మట్టి కొట్టారు: ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో రైతుల భూములను లాక్కున్న ఘనత దివంగత వైయస్ దేనన్నారు. సెజ్ ల పేరిట రైతుల నోట్లో మట్టి కొట్టారని ధ్వజమెత్తారు. నిన్నగాక మొన్న వచ్చిన జగన్ కు రైతుల సమస్యలు ఏం తెలుసునని ప్రశ్నించారు. రైతులకు ప్రకటించిన సాయం ఏ మూలకు సరిపోదని మరో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో అన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే రాష్ట్రంలో ఒక్క ముఖ్యమంత్రి కిరణ్ కు మాత్రమే కనిపించడం లేదన్నారు. చంద్రబాబుకు పేరు వస్తుందనే కిరణ్ మొండిగా వ్యవహరిస్తున్నట్టున్నారని అన్నారు. చంద్రబాబుపై వ్యంగాస్త్రాలు సరికాదని, భాష రాకుంటే భాష నేర్చుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications