జాతీయ నేతల విజ్ఞప్తితో చంద్రబాబు నిరాహార దీక్ష విరమణ

చంద్రబాబు దీక్షకు అన్నాడియంకె నేత జయలలిత, జెడిఎస్ నేత దేవెగౌడ, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ సంఘీభావం తెలిపారు. దీక్ష విరమించాలని వారు చంద్రబాబును కోరారు. రైతు సమస్యలపై పోరాటం చేయడానికి సిద్ధం కావాలని వారు సూచించారు. రైతు గర్జన పేరిట గుంటూరులో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు తెలుగుదేశం, వామపక్షాలు సన్నాహాలు చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం దీక్ష విరమించారు. ఈ నెల 17వ తేదీ నుంచి చంద్రబాబు నిరాహార దీక్ష చేస్తున్నారు. జాతీయ స్థాయిలో రైతు ఐక్య ఉద్యమం చేపట్టేందుకు చంద్రబాబు దీక్ష విరమించారు. కొబ్బరి నీళ్లు తాగించి చంద్రబాబు చేత జాతీయ నాయకులు దీక్ష విరమింపజేశారు.












Click it and Unblock the Notifications