ప్రభుత్వానికి రైతుల ఉసురు తలుగుతుంది: చంద్రబాబు శాపం

రైతుల సమస్యలపై నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన చంద్రబాబునాయుడుకు స్వామినాథన్ పరిశోధన సంస్థ ఛైర్మన్ ఎంఎస్ స్వామినాథన్ సంపూర్ణ మద్దతు తెలిపారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణలో చంద్రబాబు సేవలు ఎంతో అవసరమని ఆయన లేఖలో పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం మరిన్ని పోరాటాలు కొనసాగించేందుకు గాను నిరవధిక నిరాహార దీక్ష విరమించాలని ఆయన చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. దీక్ష చేస్తున్న చంద్రబాబు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
రైతులకు ఆత్మస్థయిర్యం ఇచ్చేందుకే చంద్రబాబు దీక్ష చేపట్టారని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు అన్నారు. ప్రభుత్వానికి రాజకీయాలు దగ్గర పడ్డాయని ఆయన అన్నారు. సచివాలయం ముట్టడికి దిగిన తమ పార్టీ శానససభ్యులను పోలీసులు అరెస్టు చేయడాన్ని తెలుగుదేశం శాసనసభ్యుడు రావుల చంద్రశేఖర రెడ్డి తప్పు పట్టారు. శాసనసభ్యులను అరెస్టు చేసే పద్ధతి ఇదేనా అని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications