తెలంగాణపై సీమాంధ్ర ఎంపి కావూరి సాంబశివ రావు విషం కక్కారా?

ఆ విధానాన్ని దేశవ్యాప్తంగా వర్తింపజేయాలని ఆయన అన్నారు. దేశాన్ని 500 రాష్ట్రాలుగా ఏర్పాటు చేయండని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తామని తమ కాంగ్రెసు పార్టీ ఎప్పుడూ చెప్పలేదని ఆయన అన్నారు. తెలంగాణపై శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చేసిన ప్రకటనను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా అవును అని ఆయన చెప్పారు. అయితే, అది 12 ఏళ్లు పడుతుందా, 20 ఏళ్లు పడుతుందా చెప్పలేమని ఆయన అన్నారు.
కెఎస్ రావు వ్యాఖ్యలపై కాంగ్రెసు తెలంగాణ నాయకులు పాల్వాయి గోవర్దన్ రెడ్డి, కమలాకరరావు, కెఆర్ అమోస్ మండిపడ్డారు. వ్యాపార ప్రయోజనాల కోసమే తెలంగాణను వ్యతిరేకిస్తున్నారని పాల్వాయి గోవర్దన్ రెడ్డి అన్నారు. కెఎస్ రావు వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, తాము తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటామని ఆయన అన్నారు. కెఎస్ రావు వంటి సీమాంధ్ర వ్యాపారులు తెలంగాణను వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications