వైయస్ జగన్ దీక్షకు వెళ్లిన శాసనసభ్యులది క్రమశిక్షాణా రాహిత్యమే

Kavuri Sambhasiva Rao
హైదరాబాద్: తెలంగాణ అంశంపై కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదికను స్వాగతిస్తామని ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావురు సాంబశివరావు శుక్రవారం స్పష్టం చేశారు. కమిటీ నివేదికతో తెలంగాణ అంశానికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ఉన్న సమస్య ఇప్పటితో తీరిపోతుందనే తాను భావిస్తున్నట్టు చెప్పారు.

మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ లక్ష్యదీక్షలో శాసనసభ్యులు పాల్గొనడం క్రమశిక్షణా రాహిత్యం క్రిందకే వస్తుందన్నారు. వారిపై అధిష్టానం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పార్టీలకు అధికారమే సర్వస్వం కాకూడదని, ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే వారు సిద్ధాంతం కోసం పని చేయాలన్నారు. ఇప్పట్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి డోకా లేదని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రైతాంగ సమస్యలపై చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షలో నిజాయితీ లేదన్నారు. పార్టీకోసం అహర్నిషలు పని చేసినా తనకు సరైన న్యాయం జరగలేదని అసంతృప్తి ఉందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+