రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ హైదరాబాద్ విడిదికి తెలంగాణ సెగ?

ఈ నెలాఖరున తెలంగాణ అంశంపై కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదిక కేంద్రానికి సమర్పించనున్నారు. నివేదిక కారణంగా అటు సీమాంధ్రలోగానీ, ఇటు తెలంగాణలోగాని ఉద్రిక్త పరిస్థితులు చెలరేగే అవకాశమున్నందున ముందుగానే ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. శ్రీకృష్ణ కమిటీ కేంద్రానికి నివేదిక సమర్పించేకన్నా ముందుగానే ఆమె హైదరాబాద్ నుండి పయనమవుతారు.
కాగా, రాష్ట్రపతి హైదరాబాద్ కు స్వాగతం చెప్పే సమయంలో ప్రొటోకాల్ సమస్య తలెత్తింది. దానం నాగేందర్, తదితర మంత్రులను విమానాశ్రయం లోనికి వెళ్లడానికి అధికారులు అనుమతించలేదు. దీంతో దానం నాగేందర్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయినా ఫలితం లేకపోయింది. ఈ విషయాన్ని తాము ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్తామని రాష్ట్ర చేనేత శాఖ మంత్రి పి. శంకరరావు చెప్పారు.












Click it and Unblock the Notifications