జగన్ రాజకీయాల్లో బచ్చా, కాంగ్రెసు తో లాలీచియా: సోమిరెడ్డి

రైతాంగ సమస్యలు పరిష్కరించాలంటూ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న తెదేపా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిపై అవాస్తవ కథనాలు ప్రచురించడం సిగ్గుచేటు అన్నారు. బాత్ రూంలనుండి రాష్ట్రంలోని ప్రతి పథకానికి గాంధీల పేర్లు పెట్టుకున్నప్పుడు గుర్తుకు రాని ఆత్మగౌరవం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. 15 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన లక్ష్యదీక్షలో రైతాంగ సమస్యలేవని ప్రశ్నించారు. జగన్ ను నిర్వీర్యం చేయడానికి అధికార కాంగ్రెసు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు లాలూచీ పడటం ఏంటన్నారు. రాజకీయాల్లో బచ్చా అయిన జగన్ కోసం మేం లాలూచీ పడతామా అన్నారు. రైతుల గురించి ఏం తెలుసని జగన్ మాట్లాడుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications