రైతు కన్నీరు రాష్ట్రానికి అరిష్టం: వైయస్ జగన్ బహిరంగ లేఖ

రైతన్నలు ధైర్యం కోల్పోవద్దని చెప్పారు. రాష్ట్ర వ్యవసాయ రంగానికి నిజంగానే ఇది అత్యయిక స్థితి అని చెప్పారు. రైతు కన్నీరు రాష్ట్రానికి అరిష్టం అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సాయం ప్రకటించిన తర్వాత కూడా 145 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. లక్షలాది మంది రైతులు ఒక్కచోట కూర్చుని నిరాహార దీక్ష చేసి, తమ బాధలు నినదించినా ప్రభుత్వంలో చలనం లేకుండా పోయిందన్నారు. 48 గంటల పాటు మెతుకు ముట్టకుండా నీరసించినా స్పందించలేదని ఆరోపించారు.
కాగా వైయస్ జగన్ గురువారం బెంగుళూరు వెళ్లారు. శుక్రవారం బెంగుళూరునుండి పులివెందులకు చేరుకున్నారు. ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం తమ పార్టీ ప్రకటన వెలువడే ప్రదేశాన్ని ఎంపిక చేసి దానిని పరిశీలించారు. పార్టీ ప్రకటించే ప్రదేశం వైయస్ సమాధి సమీపంలోనే ఉంది.












Click it and Unblock the Notifications