చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిసెంబర్ 31 తర్వాత ఏమీ కాదు: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
తిరుపతి‌: డిసెంబర్ 31వ తేదీ తర్వాత రాష్ట్రంలో ఏ విధమైన మార్పులు ఉండవని, ఏమీ కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మీడియా సంయమనం పాటించాలని ఆయన శనివారం తిరుపతిలో అన్నారు. తిరుపతి నుంచి ఆయన ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తన స్వగ్రామం వెళ్లారు. అక్కడ నగరిపల్లెలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీతో మాట్లాడి పంట నష్టపోయిన రైతులకు తగిన విధంగా బీమా సొమ్ము లభించేలా చూస్తామని ఆయన చెప్పారు. రైతుల కోసం మరింత సాయం రాబడుతామని ఆయన హామీ ఇచ్చారు. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ పెంచాలని కోరామని ఆయన చెప్పారు. గిట్టుబాటు ధరకు 20 శాతం రంగు మారిన ధాన్యాన్ని ఎఫ్ సిఐ కొనుగోలు చేస్తుందని ఆయన చెప్పారు.

రైతు మరణాలకు పంట నష్టానికి సంబంధం లేదని ఆయన అన్నారు. గుండెపోటును ఆత్మహత్యగా చిత్రీకరించవద్దని ఆయన సూచించారు. మీడియా పాజిటివ్ కథనాలు రాయాలని ఆయన హితబోధ చేశారు. ఉప్పుడు బియ్యం ఎగుమతికి అనుమతి ఇవ్వాలని కోరామని, దానివల్ల తగిన ధర లభిస్తుందని ఆయన అన్నారు. తాను పుట్టింది హైదరాబాదులోనే అయినా రాజకీయ పునాది పీలేరులోనే అని ఆయన అన్నారు. రెండు ప్రాంతాల ప్రతినిధిగా తాను గర్వపడుతున్నట్లు ఆయన తెలిపారు. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కన్నా తామే రైతులకు ఎక్కువ సాయం చేశామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X