కాంగ్రెసు తెలంగాణ ఎంపీల దీక్ష: జానా రెడ్డి దౌత్యం విఫలం

కేసుల ఎత్తివేయాలని తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వివరిస్తానని జానా రెడ్డి చెప్పారు. కేసులు ఎత్తేయాలని తాము సమిష్టిగా పలుసార్లు కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి, ప్రభుత్వానికి విన్నవించుకున్నామని, ఫలితం లేకపోవడం తమ పార్టీ పార్లమెంటు సభ్యులు సత్యాగ్రహం చేస్తున్నారని, వారికి తన సంఘీభావం తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. కేసు ఎత్తివేతకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, పార్లమెంటు సభ్యులు దీక్షలు విరమించాలని తాను కోరుతున్నానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications