ఆందోళన నేరంగా చూడరాదు: కాంగ్రెసు ఎంపీల దీక్షలో కోదండరామ్

Kodandaram
హైదరాబాద్: రాజ్యాంగబద్దంగా, శాంతియుతంగా ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై ప్రభుత్వం పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ సోమవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని కోరుతూ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్కు వద్ద కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు చేపట్టిన దీక్ష వద్దకు ఆయన వచ్చి తన మద్దతును ప్రకటించారు. వారి దీక్ష విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. రాజకీయ అంశాల మీద జరుగుతున్న ఆందోళనను నేరంగా చూడకూడదని ఆయన అన్నారు. ప్రభుత్వం కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. కేంద్రహోంశాఖ మంత్రి స్వయంగా ఆహ్వానించినా వారిలో చలనం లేదన్నారు. ఇది వలసవాదుల దుర్మార్గాన్ని బయట పెడుతుందన్నారు. ఇప్పుడు సొంత పార్టీవారే డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం దిగి రావడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. కాంగ్రెసు ప్రజాప్రతినిధులు తమ సాధనలో విజయం అయ్యే వరకు వారి పోరాటం కొనసాగించాలని, వారికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+