లక్షలు దోచుకున్నా ఏమనలేదు: ప్రభుత్వంపై విరుచుకుపడ్డ చిరు

Chiranjeevi
గుంటూరు: ప్రభుత్వం ప్రకటించిన సాయం రైతులకు సరిపోకనే రాష్ట్రంలో రైతుల మరణాలు చోటు చేసుకుంటున్నాయని ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి మంగళవారం గుంటూరులో ఆరోపించారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయి మరణించిన రైతు కుటుంబాలను ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం రైతు సమస్యలపై దృష్టి సారించడం లేదన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 400కోట్ల రూపాయలు సరిపోవన్నారు. ప్రభుత్వం ఉదాసీనత వల్లే రైతుల మరణాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తే మరణాలు ఉండవన్నారు. పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు 10వేల రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కుంభకోణాల ద్వారా లక్షల కోట్లు దోచుకున్న వారిని ఏమీ అనని కేంద్రం రైతాంగానికి 4వేల కోట్లు ఇస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. కాగా చిరంజీవి గుంటూరు జిల్లాలో 14 మంది రైతు కుటుంబాలను పరామర్శిస్తారు. వారికి ప్రజారాజ్యం తరఫున ఆర్థిక సాయం అందిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+