ఎంపీల దీక్షకు దిగొచ్చిన అధిష్టానం: కేసులన్నీ ఎత్తివేయాలని ఆదేశం

సోమవారం కేసులు ఎత్తివేయాలని కాంగ్రెసు ఎంపీలు దీక్షకు దిగడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మరో 135 కేసులు ఎత్తివేయడానికి సంసిద్దత వ్యక్తం చేసింది. అయితే ఎంపీలు మాత్రం అన్ని కేసులు ఎత్తివేయాల్సిందేనని డిమాండ్ చేశారు. శాసనసభ సమావేశాల సందర్భంగా విపక్షాలు విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని కోరితే ముఖ్యమంత్రి ప్రభుత్వం 565 కేసులు ఎత్తివేయడానికి సుముఖత వ్యక్తం చేసింది. అయితే విపక్షాలు ఎంతగా అన్ని కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేసినప్పటికీ ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు. న్యాయపరమైన చిక్కులు వస్తాయని వాటన్నింటిని పరిశీలించిన అనంతరం ఒక్కోటి ఎత్తివేస్తామని చెప్పుకొచ్చారు.
అందుకు తెలంగాణ కాంగ్రెసు తో సహా అన్ని పార్టీలు ససేమీరా అన్నాయి. కోర్టులో న్యాయపరమైన చిక్కులు వస్తే తరువాత చూసుకోవచ్చునని డిఎస్ కూడా సూచించారు. అయినప్పటికీ సిఎం ససేమీరా అన్నారు. ఇప్పుడు అధిష్టానం అదేశంతో ఇరుప్రాంతాలలోని సుమారు 1600 కేసులు సాయంత్రం ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయి. కేసులు ఎత్తివేయడంతో పాటు న్యాయపరమైన చిక్కులు మళ్లీ మళ్లీ రాకుండా కేసులు ఎత్తివేయాలని అధిష్టానం అదేశించినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications