బాబాయ్ వైయస్ వివేకానంద, వైయస్ జగన్ కరపత్రాల యుద్ధం

YS Vivekananda Reddy-YS Jagan
కడప: ఏది నిజం పేరుతో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నలకు పులివెందుల సమావేశంలో సమాధానాలు చెప్పిన కరపత్రాన్ని ప్రశ్నిస్తూ ఆత్మగౌరవం అక్కర్లేదా అనే మరో కరపత్రం కడప జిల్లాలో మంగళవారం వెలుగుచూసింది. గత వారం పులివెందుల నియోజకవర్గం కార్యకర్తలతో వ్యవసాయ శాఖమంత్రి వైయస్ వివేకానంద ఏర్పాటు చేసిన సమావేశంలో ఏది నిజం పేరుతో కరపత్రాలు పంచారు. అందులో జగన్ కాంగ్రెస్ అధిష్టానంపై విసిరిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తనకు తన తల్లి విజయలక్ష్మికి అపాయింటుమెంట్ ఇవ్వలేదని, అదే వివేకానందకు ఒక్కరోజులోనే అపాయింటుమెంటు ఇచ్చిందనడాన్ని ఆ కరపత్రంలో ఖండించారు. పులివెందుల ఉప ఎన్నికలకు ముందు ఒక్కరోజులోనే అపాయింటుమెంటు ఇచ్చారని చెప్పారు. ఓదార్పును బలప్రదర్శనగా చేయకూడదన్నప్పటికీ జగన్ బల ప్రదర్శన వేదికగా మార్చాడని అయినప్పటికీ అధిష్టానం చర్యలు తీసుకోలేదని కరపత్రంలో పేర్కొన్నారు. వివేకాకు మంత్రి పదవి ఇస్తే జగన్ కు అక్కసు ఎందుకని కూడా ప్రశ్నించింది.

జగన్ కు పదవి ఇస్తే కుటుంబాన్ని చీల్చనట్టు, వివేకానందకు మంత్రి పదవి ఇస్తే చీల్చనట్టా అని ప్రశ్నించింది.ఆ కరపత్రానికి ప్రతిగా జగన్ వర్గంగా భావిస్తున్న కొందరు ఆత్మగౌరవం అక్కరలేదా అనే కరపత్రాన్ని ముద్రించినట్టు తెలుస్తోంది. ఢిల్లీ చెప్పినట్టు ఉండాలా, తెలుగువారికి ఆత్మగౌరవం అవసరం లేదా అని వివేకాను పరోక్షంగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఇటు బాబాయ్ ఏది నిజం, అబ్బాయ్ ఆత్మగౌరవం అక్కర్లేదా కరపత్రాలు జగన్, వివేకా కుటుంబ సభ్యుల వివాదం ఏ స్థాయిలో ఉందో చెబుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+