తెలంగాణ రాష్ట్రం సాధించి తీరుతాం: కాంగ్రెసు ఎంపి కేశవరావు

తెలంగాణ పట్ల ఆవేశంగా ఉద్యమం చేసిన విద్యార్థుల పట్ల ప్రభుత్వం సానుభూతితో ఉందన్నారు. విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయడంతో కాంగ్రెసు పట్ల, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ పట్ల నమ్మకం పెరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి సైతం అందరమూ కలిసి పని చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. తెలంగాణకోసం వారితో కలిసి పనిచేసి తెలంగాణను సాధించుకుందామని చెప్పారు. విద్యార్థులపై కేసులు ఎత్తివేయడానికి ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చినందువల్ల దీక్షను విరమించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. దీక్షకు మద్దతు పలికిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అందరం కలిసి కట్టుగా ఉద్యమిస్తే తెలంగాణ కూడా సాధ్యమవుతుందన్నారు.












Click it and Unblock the Notifications