ప్రోటోకాల్ పై ఎమ్మెల్యే శ్రీధర్, మంత్రి బస్వరాజు వర్గీయుల మధ్య ఘర్షణ
Districts
oi-Srinivas G
By Srinivas
వరంగల్: వరంగల్ జిల్లాలో మంత్రి బస్వరాజు సారయ్య, శాసనసభ్యుడు శ్రీధర్ వర్గీయుల మధ్య బుధవారం తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఎనుమాముల మార్కెట్ యార్డులో ప్రోటోకాల్ విషయంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. మంత్రి బస్వరాజు వస్తున్న కార్యక్రమంలో శాసనసభ్యుడు శ్రీధర్ ఫోటో పెట్టలేదని శ్రీధర్ వర్గీయులు వాగ్వాదానికి దిగారు. వాగ్వాదం కాస్త ముదిరింది. అది కాస్త తీవ్ర ఘర్షణకు దారి తీసింది. వివాదానికి కారణమైన ఎనుమాముల మార్కెట్ యార్డు కార్యదర్శిని సస్పెండ్ చేయాలంటూ శాసనసభ్యుడు శ్రీధర్ ధర్నా చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వచ్చి ఇరువర్గాలను సముదాయించారు.