ఢిల్లీలోనూ తెలంగాణ హీట్, కోర్ కమిటీతో ప్రధాని మన్మోహన్ సమీక్ష

Manmohan Singh
హైదరాబాద్: తెలంగాణ రాజధాని ఢిల్లీకి తాకింది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక నేపథ్యంలో తెలంగాణ,సమైక్యాంధ్ర, మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్ గొడవల నేపథ్యంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఎకే ఆంటోనీ, ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం,ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంఛార్జ్ వీరప్ప మొయిలీలతో తన నివాసంలో సమావేశమయ్యారు.డిసెంబర్ 31వ తారీఖులోపు శ్రీకృష్ణ కమిటీ నివేదికను కేంద్రానికి సమర్పించనున్న దృష్ట్యా రాష్ట్ర పరిస్థితులపై వారితో ప్రధాని సమీక్ష జరుపుతున్నారు.తెలంగాణతో పాటు గూర్ఖాలాండ్ తదితర చిన్న రాష్టాల సమస్యపై వీరి చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ సమావేశంలో ఏఐసిసి అధ్యక్షులు సోనియాగాంధీ మినహా కోర్ కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఎప్పుడు ఇవ్వాలి అనే విషయమై కూడా వారు చర్చించే అవకాశం ఉంది. ఎల్లుండి వరకు కమిటీ నివేదికకు సమయం ఉన్నప్పటికీ రేపే ఇచ్చే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వీరితో కూడా పార్టీ అధిష్టానం సమావేశమవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+