చిదంబరంతో భేటీ: నివేదిక సమర్పణకు సమయం కోరిన దుగ్గల్

కాగా, శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులు తమ ఉన్నాయని ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చెప్పుకుంటోంది. అయితే, రాష్ట్రంలో శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని వాటిని వెల్లడించలేదని చెబుకుంటోంది. శ్రీకృష్ణ కమిటీ సభ్యులు గురువారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత నివేదికను సమర్పించి, చిదంబరానికి తాము చేసిన కృషిని వివరించనున్నారు. ఆ తర్వాత శ్రీకృష్ణ కమిటీ సభ్యులు మీడియాతో కూడా మాట్లాడుతారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో పెద్ద యెత్తున కేంద్ర బలగాలను దించారు.












Click it and Unblock the Notifications