హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ అధికారం కోసం మూడేళ్లు వెయిట్ చేస్తారా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో భాగంగానే దానిని అందరూ అనుకుంటారని అందుకే తాను ఎంపీగా పోటీ చేస్తున్నానని మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించి ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశ్యం లేదని ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆయన మాటలను నమ్మే వారు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన వర్గం వీలైనంత తొందరగా అధికారమే పరమావధి లక్ష్యంగా పని చేస్తుంది. ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఇరవై లోపు కంటే ఎమ్మెల్యేలు తన వెంట వచ్చే పరిస్థితి లేనందున ఎంపీగా గెలిచిన తర్వాత సాధ్యమైనంత ఎక్కువ ఎమ్మెల్యేలను తనవైపు లాక్కోవడమే ఆయన ముఖ్యోద్దేశ్యంగా కనిపిస్తోంది.

ఓదార్పు పేరిట తనకున్న ప్రజాబలాన్ని, రైతు యాత్రల పేరిట విజయవాడ, గుంటూరు జిల్లాల్లో ఎమ్మెల్యేల లెక్కలు వేసుకున్నాడని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా ఎంపీగా పోటీ చేసినప్పటికీ రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికల లక్ష్యంగా తన ప్రయత్నాలు చేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. తాను చేసే ప్రయత్నాల్లో విఫలమైనా, విజయం సాధించినా ఎమ్మెల్యేగా ఉండి అపవాదం తెచ్చుకోవడం కంటే ఎంపీగా ఉండి ప్రయత్నాలు చేసినా ఎవరినుండి ఎలాంటి అపవాదులు రావని ఆయన భావిస్తున్నట్టు ఉన్నారు. తెలంగాణ లేదా సీమాంధ్ర సమస్య తీవ్ర రూపం దాల్చి అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాల్సిన ఆవశ్యకత కూడా ముందున్న నేపథ్యంలో తాను ప్రభుత్వాన్ని పడవేయడం కంటే ప్రాంతీయ ఉద్యమాల కారణంగా కిరణ్ కుమార్ ప్రభుత్వం పడిపోతే ఆ అపఖ్యాతి తనమీద రాకుండా ఉంటుందని భావిస్తున్నారు.

ఒకవేళ ప్రాంతీయ ఉద్యమాల కారణంగా కిరణ్ ప్రభుత్వానికి ఢోకా లేదనుకున్న సమయంలో జగన్ తన ప్రయత్నాలు ముమ్మరం చేసే పనిలో పడతారని భావిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు జగన్ బలపరుస్తున్నారు. తనకు తానుగా పార్టీనుండి బయటకు రాలేదని, పార్టీయే కుట్ర చేసి తనను బయటకు పంపించిందని జగన్ ప్రజల సానుభూతి పొందే యత్నాలు చేస్తున్నారు. ప్రజలకు ఆ సానుభూతి మరెంతో కాలం ఉండదు. ప్రజల సానుభూతిని ఓట్లరూపంలోకి మార్చుకోవాలంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తేనే అది సాధ్యం. తన తండ్రి దివంగత వైయస్ తీసుకు వచ్చిన ప్రభుత్వం కాబట్టి పడగొట్టే ఉద్దేశ్యం లేదని చెప్పినప్పటికీ మరో మూడేళ్ల వరకు జగన్ వెయిట్ చేస్తే ఇప్పుడు సపోర్టు చేస్తున్న వారిలో సగం కూడా మిగలక పోవడమే కాకుండా, పది సీట్లు రావడమూ కష్టమే. ముఖ్యమంత్రి కిరణ్ జగన్ వైపు నేతలను తనవైపు లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తారనడంలో సందేహం లేదు.

తన జిల్లాలోనే తన ప్రత్యర్థి అయిన గల్లా అరుణకుమారికి మంత్రి పదవిని తిరిగి ఇవ్వడం ద్వారా ఆమెను, ఆమె వర్గాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్న కిరణ్ జగన్ వర్గం నాయకులపై స్థానిక సంస్థల ఎన్నికలు తదితర ఎన్నికల ద్వారా ఆ ప్రయోగం చేయవచ్చు. అధికారంలో లేని, అసలు జగన్, తల్లి విజయమ్మ తప్ప ఎవరూ లేని పార్టీని మూడేళ్లు కొనసాగించడం జగన్ కు సాధ్యం కాదు. ఇప్పుడు ఎంత త్వరగా ఎన్నికలు వస్తే అంతగా లాభపడేది జగన్ తప్ప మరెవరూ లేరు. అందుకే ఆయన సాధ్యమైనంత తొందరగా ఎన్నికలు కోరుకుంటున్నారు. అయితే తన మనసులోని మాటను బహిర్గతం చేయటం లేదనిపిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X