కాంగ్రెసులో కలవరం: తెలంగాణపై వేడెక్కిన ఢిల్లీ, ఎంపీల సందడి

Kiran Kumar Reddy
న్యూఢిల్లీ: తెలంగాణ వేడి ఢిల్లీ కాంగ్రెసు పెద్దలను తాకింది. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఈ నెల 6వ తేదీ అఖిల పక్ష సమావేశంపై గందరగోళం నెలకొనడంతో కాంగ్రెసు అధిష్టానం కలవరం చెందుతోంది. ఈ సమావేశానికి రాష్ట్రానికి చెందిన పలు రాజకీయ పార్టీలు హాజరు కావడానికి సిద్ధంగా లేవు. దీంతో తెలంగాణ అంశాన్ని ఇతర పార్టీలపైకి నెట్టి, సాగదీత ధోరణి అవలంబించాలనే కాంగ్రెసు అధిష్టానం వ్యూహం బెడిసికొట్టినట్లయింది. మరోవైపు, కాంగ్రెసు తెలంగాణ నాయకుల తీరు కూడా పార్టీ అధిష్టానాన్ని కలవరానికి గురి చేస్తోంది. దీంతో అధిష్టానం పార్టీ తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులను ఢిల్లీకి పిలిపించారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు ఢిల్లీకి దారి పట్టారు. అయితే, తెలంగాణపై తీవ్ర స్వరంతో మాట్లాడుతున్న కె. కేశవరావు తనకు అధిష్టానం నుంచి ఎటువంటి ఫోన్ కూడా రాలేదని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+