నాపై, వైయస్ జగన్‌పై ఓ దుష్టశక్తి కుట్ర చేస్తోంది: గాలి జనార్దన్ రెడ్డి

మైనింగ్ లీజు రద్దుకు సిఫార్సు చేసే అర్హత సీఈసీకి లేదన్నారు. దేవుడు తమవైపు ఉన్నాడని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. తమ దగ్గర కొన్ని విష్ణు చక్రాల్లాంటివి ఉన్నాయని, తాము కూడా వాటిని బహిర్గతం చేస్తామని కేంద్రాన్ని ఉద్దేశించి ఆయన హెచ్చరించారు. అటవీ ప్రాంతాల్లో మైనింగ్ జరుగుతోందా లేదా అన్న విషయాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు సీఈసీని నియమించిందని, దానిని వదిలేసి మిగిలిన విషయాల్లో సీఈసీ జోక్యం చేసుకుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తప్పుబడుతూ తమ మైనింగ్ లీజులను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టుకు నివేదిక అందజేసిందని మండి పడ్డారు. అయినా, ఈ నివేదిక కొత్తదేమీ కాదని కొట్టిపారేశారు. సీఈసీకి నేతృత్వం వహిస్తున్న ఏకే జ్వరాజీ రాజకీయ శక్తులకు తలొగ్గారని ఆరోపించారు. సుప్రీంకోర్టులో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు.












Click it and Unblock the Notifications