ఒయులో పోలీసు ఘటనలపై తెలంగాణ నేతల గరం

పోలీసులు విద్యార్థులను కొడుతున్నారని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు ఆర్. దామోదర్ రెడ్డి అన్నారు. విద్యార్థుల పట్ల మానవత్వం లేకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆయన విమర్శించారు. విద్యార్థుల పట్ల పోలీసుల తీరును తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ కూడా తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications