హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజీనామా చేస్తే తెలంగాణ వస్తుందా: మాట మార్చిన కెకె

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Keshav Rao
హైదరాబాద్: రాజీనామాలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె కేశవరావు మాటమార్చారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత కేంద్రం తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెస్ సభ్యులమంతా రాజీనామా చేస్తామని ప్రకటించిన కెకె రాజీనామాలు చేస్తే తెలంగాణ వస్తుందా అని ఆదివారం ప్రశ్నించారు. రాజీనామాలు చేస్తే తెలంగాణ వస్తుందంటే తాము రాజీనామాలు చేయడానికి సిద్ధమని ఆయన అన్నారు.

తెలంగాణ సాధనకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని కొత్త పాట పాడుతున్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక అంతా గందరగోళంగా ఉందన్నారు. అయినప్పటికీ దానిని పూర్తిగా అధ్యయనం చేస్తామని చెప్పారు. అయితే శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో ఎక్కడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తప్పు పట్టలేదని అర్థమవుతోందన్నారు.

హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ కోసమే మా పోరాటం ఉంటుందన్నారు. ప్రత్యేక తెలంగాణ వస్తే సీమాంధ్రులకు ఎలాంటి భయం లేదనే నమ్మకాన్ని కలిగించడానికి మా ప్రయత్నాలు చేస్తామన్నారు. సీమాంధ్ర నేతలతో ఇప్పటికే ఒకసారి సమావేశమయ్యామని మరోసారి సమావేశమయి వారికి స్పష్టమైన హామీ ఇస్తామన్నారు. వారి హక్కులపై చర్చిస్తామన్నారు. ఈనెల 11న మరోసారి తెలంగాణకు చెందిన నేతలమంతా భేటీ కానున్నామని ఆ భేటీలో చర్చించిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులను క్రిమినల్సుగా మార్చవద్దని ఆయన కోరారు. విశ్వవిద్యాలయంలో ఉన్న కేంద్ర బలగాలను వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బలగాలను తొలగించకుంటే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తుందని కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయన్నారు. అలాంటి వార్తే నిజమైతే అంతకన్నా దురదృష్టకరం లేదన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X